Home  »  TV News  »  Illu illalu pillalu: కొత్త కార్ తీసుకున్న ధీరజ్.. నర్మదకి టెన్షన్!

Updated : Feb 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-405 లో.. ప్రేమకి సర్ ప్రైజ్ ఇవ్వడానికి ధీరజ్ ప్లాన్ చేస్తాడు. తనని కార్ షోరూమ్ కి తీసుకెళ్తాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావని అడుగగా .. పొద్దున్నే గొడవ జరిగింది కదా.. సొంతంగా కార్ కొనుక్కొని నడుపుకుంటా అని ధీరజ్ చెప్తాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద కార్ అవసరమా అని ప్రేమ అడుగుతుంది. ఇక అదే సమయంలో నర్మద కాల్ చేస్తుంది.

ఏమైంది ప్రేమ పావురాలు ఎక్కడున్నారని ప్రేమతో నర్మద అనగానే ఇప్పుడే ధీరజ్ షాకిచ్చాడని చెప్తుంది. ఏంటని అడిగితే కార్ కొనడానికి నన్ను తీసుకొచ్చాడని చెప్తుంది. దాంతో నర్మద ఒక విషయం చెప్పాలని అనుకుంటుంది. కానీ అది కాకుండా మరొకటి చెప్తుంది‌ ఏంటి అక్క అని ప్రేమ అడుగగా.. నాకు నీ నగలు కావాలని అడుగుతుంది.  దానికి నన్ను అడుగాలా అక్క తీసుకోమని ప్రేమ అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకని అడుగవా అని నర్మద అనగానే దీనిలో అనడానికి ఏం ఉంది.‌ నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని ప్రేమ అంటుంది. థాంక్స్ ప్రేమ అని నర్మద అంటుంది. ధీరజ్ కన్విన్స్ చేయడానికి ప్రేమ ట్రై చేస్తుంది కానీ అతను మాట వినడు.. చేసేదేమీ లేక కార్ తీసుకొని వస్తారు. 

మరోవైపు సాగర్, నర్మద ఇద్దరు గ్లామరస్ గా రెడీ అవుతారు. ఇక నర్మద నగలు చూసిన భాగ్యం, శ్రీవల్లి తనని ఇరికించాలని అనుకుంటారు. ఇక సాగర్ వెళ్ళి వాళ్ళ అమ్మ వేదవతిని హగ్ చేసుకుంటాడు. ఇక వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఇక నర్మద నగలు చూసి.. ప్రేమ చెల్లివి కదా అని శ్రీవల్లి అనగానే నర్మద టెన్షన్ పడుతుంది.  అవును నీ‌ నగలు ఏం అయ్యాయే అని వేదవతి అనగానే మా అమ్మ వాళ్ళింట్లో ఉన్నాయి.. తను బీరువాలో పెట్టి తాళం ఎక్కడ మర్చిపోయిందట అని నర్మద కవర్ చేస్తుంది. ఓహో.. భళే కవర్ చేశావ్.. కానీ అక్కడ పార్టీలో మీ ఇద్దరి నిజస్వరూపాన్ని బయటపెడతామని భాగ్యం, శ్రీవల్లి అనుకుంటారు. ఇక పార్టీకి శ్రీవల్లి, నర్మద, సాగర్, వేదవతి వెళ్తారు‌. ఇక భాగ్యం ఆ బ్రోకర్ కి కాల్ చేసి పార్టీ జరిగే లొకేషన్ ని పంపిస్తుంది. డబ్బులు అక్కడికి వచ్చి తీసుకోమని భాగ్యం చెప్పగానే బ్రోకర్ సరేనంటాడు. మరోవైపు పార్టీలో అందరు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.